Politics19th Oct 04:43 PMSunil Byrisetty1 min read

సగం సీట్లలో జనసేన పోటీ

జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు దృష్టి సారించారు. అరకు నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 50 శాతానికి పైగా స్థానాల్లో పో

సగం సీట్లలో జనసేన పోటీ
జనసేన పార్టీని బలోపేతం చేయడంపై ఆ పార్టీ ఎమ్మెల్సీ నాగబాబు దృష్టి సారించారు. అరకు నియోజకవర్గంలో నిర్వహించిన జనసేన పార్టీ సమావేశంలో ఏజెన్సీ ప్రాంతాల్లో 50 శాతానికి పైగా స్థానాల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం అభ్యర్థులను జాబితను సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు. అరకుపై జనసేన పార్టీకి ప్రత్యేక అనుబంధం ఉందని నాగబాబు పేర్కొన్నారు. గిరిజనులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు జనసేన కృషి చేస్తుందని చెప్పారు. ఏజెన్సీ ప్రాంతాల అభివృద్ధికి పార్టీ అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్‌ కల్యాణ్‌ కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలకు నాగబాబు దిశానిర్దేశం చేశారు. ఏజెన్సీలో పార్టీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయాలని, ప్రజలకు చేరువగా ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
Scroll for the next article