Politics25th Aug 01:05 PMSunil Byrisetty1 min read
జనసేన పోటీచేసే స్థానాలపై పుకార్లు నమ్మొద్దు
జనసేన పోటీచేసే స్థానాలు ఇవేనంటూ సాగుతున్న ప్రచారం నమ్మొద్దని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. పోటీచేసే స్థానాలు, అభ్యర్థులూ వీళ్లేనంటూ సాగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపింద
జనసేన పోటీచేసే స్థానాలు ఇవేనంటూ సాగుతున్న ప్రచారం నమ్మొద్దని జనసేన పార్టీ కార్యాలయం ప్రకటించింది. పోటీచేసే స్థానాలు, అభ్యర్థులూ వీళ్లేనంటూ సాగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని తెలిపింది. పవన్ సూచనలకు అనుగుణంగా స్థానిక ఎన్నికలపై చర్చలు జరుగుతున్నట్లు పేర్కొంది. కూటమి భాగస్వామ్య పక్షాలతో చర్చలు ప్రాథమిక దశలో ఉన్నాయని చెప్పింది. క్షేత్రస్థాయి సమాచారాన్ని సమీక్షించాక స్థానాలపై స్పష్టత వస్తుందని తెలిపింది. అభ్యర్థులకు సంబంధించి పవన్ తుది నిర్ణయం తీసుకుంటారని, పార్టీ విధివిధానాలు, క్రమశిక్షణ అందరూ పాటించాలని కోరింది.