Politics1st Sep 05:34 PMSunil Byrisetty1 min read
జనసేన ఆపరేషన్ ‘జెన్ జీ’
జనసేన యువతరాన్ని ఆకట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. జెన్ జీకి చేరువ అయ్యేలా.. `యూత్ @ జనసేన` పేరుతో యువజన విభాగాన్ని ప్రారంభిస్తోంది. అనేక కసరత్తులు.. యువత నుంచి
జనసేన యువతరాన్ని ఆకట్టుకునేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. జెన్ జీకి చేరువ అయ్యేలా.. `యూత్ @ జనసేన` పేరుతో యువజన విభాగాన్ని ప్రారంభిస్తోంది. అనేక కసరత్తులు.. యువత నుంచి అభిప్రాయ సేకరణ చేసిన అనంతరం.. దీనికి శ్రీకారం చుట్టినట్టు పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. పవన్ కల్యాణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని సెప్టెంబరు 2న యువజన విభాగాన్ని ప్రారంభించనున్నట్టు జనసేన కార్యాలయం వెల్లడించింది. కేరళంలో ఉన్న పవన్ కల్యాణ్ దీన్ని వర్చువల్ గా ప్రారంభించనున్నారు. ఈ విభాగం కోసం ప్రత్యేక గీతం, లోగో, దిశానిర్దేశం చేసే విధానాలను కూడా ప్రకటింంచనున్నారు. పిఠాపురంలో ప్రత్యేక ఏర్పాట్లు చేసి, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర నాయకులు, ఎంపీలు ఈ కార్యక్రమానికి హాజరు అవుతున్నట్టు పార్టీ తెలిపింది.