Politics14th Oct 03:53 PMSunil Byrisetty1 min read

సీట్ల పంపకంలో జనసేన వాటాపై చర్చ!

ఏపీ స్థానిక ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. మున్సిపల్ సీట్ల పంపకంలో జనసేన పార్టీ వాటాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ వాటా ఇదేనంటూ జనసేన

సీట్ల పంపకంలో జనసేన వాటాపై చర్చ!
ఏపీ స్థానిక ఎన్నికలు హీటెక్కిస్తున్నాయి. మున్సిపల్ సీట్ల పంపకంలో జనసేన పార్టీ వాటాపై ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చ మొదలైంది. కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో తమ వాటా ఇదేనంటూ జనసేన ప్రతిపాదనల జాబితా విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. ఈ ప్రతిపాదిత సీట్ల జాబితాను జనసేన పార్టీ శ్రేణులు మాత్రమే కాకుండా.. ఆ పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు సైతం తమ అధికారిక సోషల్ మీడియా హ్యాండిల్స్‌లోనూ పోస్ట్ చేయడం విశేషం. మంత్రి నాదెండ్ల మనోహర్, మంత్రి కందుల దుర్గేష్‌ సహా పలువురు ప్రముఖ జనసేన నేతలు తమ సోషల్ మీడియా ఖాతాల్లో దీనికి సంబంధించిన వివరాలను పంచుకోవడం ఇప్పుడు కూటమి వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది వైరల్ అవుతున్న ప్రచారం ప్రకారం.. రాష్ట్రంలోని మొత్తం 17 మున్సిపల్ కార్పొరేషన్లలో 6 మేయర్ స్థానాలను జనసేన కోరుతోంది అందే దాదాపు 35 శాతం వాటా తమకు ఇవ్వాలని జనసేన పేర్కొంది. అలాగే 90 మున్సిపాలిటీల్లో 38 చైర్మన్ స్థానాలను తమకు కేటాయించాలని ప్రతిపాదిస్తోంది అంటే ఇందులో దాదాపు 42 శాతం వాటాను కోరుతోంది. ః
Scroll for the next article