News14th Oct 03:57 PMSunil Byrisetty1 min read

సూర్యలంకలో భారత వైమానిక దళం శిక్షణ

బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌ఏజీడబ్ల్యూ(SAGW) యూనిట్ల నిర్వహణ శిక్షణా కార్యక్రమాన్ని డిసెంబర్ 1 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు

సూర్యలంకలో భారత వైమానిక దళం శిక్షణ
బాపట్ల జిల్లా సూర్యలంక వైమానిక దళ కేంద్రంలో భారత వైమానిక దళానికి చెందిన ఎస్‌ఏజీడబ్ల్యూ(SAGW) యూనిట్ల నిర్వహణ శిక్షణా కార్యక్రమాన్ని డిసెంబర్ 1 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ మేరకు సీవార్డ్ ఆర్టిలరీ ప్రాక్టీస్ చట్టం, 1949లోని సెక్షన్ 3ఏ కింద రాష్ట్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది.ఈ శిక్షణా కార్యక్రమం డిసెంబర్ నెలలో రెండు దశల్లో జరగనుంది.మొదటి దశ డిసెంబర్ 1 నుంచి 11వ తేదీ వరకు,రెండో దశ డిసెంబర్ 12 నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నారు.ఈ రెండు దశల్లోనూ ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు కార్యకలాపాలు కొనసాగుతాయి. శిక్షణా కార్యక్రమం నేపథ్యంలో సూర్యలంక వైమానిక దళ కేంద్రానికి ఆనుకుని ఉన్న బాపట్ల మండల పరిధిలోని సముద్ర తీర ప్రాంతాన్ని నిర్దేశిత సమయాల్లో ప్రమాదకర ప్రాంతంగా ప్రకటించారు.శిక్షణా కాలంలో నిర్దేశిత ప్రాంతంలోకి ప్రజలు వెళ్లకుండా అవసరమైన హెచ్చరికలు జారీ చేయాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చారు.
Scroll for the next article