Entertainment12th Jul 10:33 AMSunil Byrisetty1 min read
సరస్వతి అంటే జానకమ్మ!
చాలా సంవత్సరాల క్రిందట ఘంటసాల మాస్టారు ఏదో సినిమాకి సంగీతం అందిస్తున్నారట అయితే రికార్డింగ్ కి సమయం ఆసన్నమవడంతో ఒక అసిస్టెంట్ ని పిలిచి ఇక్కడ సరస్వతి అమ్మగారు ఉంటారు ఆవిడని పిలవండి
చాలా సంవత్సరాల క్రిందట ఘంటసాల మాస్టారు ఏదో సినిమాకి సంగీతం అందిస్తున్నారట అయితే రికార్డింగ్ కి సమయం ఆసన్నమవడంతో ఒక అసిస్టెంట్ ని పిలిచి ఇక్కడ సరస్వతి అమ్మగారు ఉంటారు ఆవిడని పిలవండి అన్నారట ఆసిస్టెంట్ ఇక్కడ సరస్వతి ఎవరూ సరస్వతి ఎవరు అని అక్కడికక్కడే తిరుగుతుంటే ఘంటసాల మాస్టారు మళ్ళీ పిలిచి ఏమయ్యా నీ ఎదురుగా ఉన్నారు కదా అక్కడికక్కడే తిరుగుతున్నావెందుకు అని జానకమ్మను చూపించారట..
మరికొంత కాలం తర్వాత ఎస్పీ బాలు, జానకమ్మ గురించి ఏం చెప్పగలమండి ఆమె నవ్వుతూ పాడడం ఒక ఎత్తు అయితే పాటలో నవ్వడం ఇంకొక ఎత్తు . బహుశా సరస్వతి దేవి ఆయనకు ఇచ్చిన వరం ఏమో అటువంటి తోటి గాయనీయమనులతో జ్ఞాన సరస్వతులతో పాడడం నా అదృష్టమేమో అన్నారట...
1994లో భైరవద్వీపం అనే సినిమా రిలీజ్ అయిన తర్వాత నరుడా ఓ నరుడా అనే పాటకు జానకమ్మ గారికి రాష్ట్ర ప్రభుత్వం నంది అవార్డు ప్రధానం చేసింది అంతలోనే టెలిఫోన్ మోగిందట ఆ ఫోన్లో ఆశా బోంస్లే ఒక మాట అన్నారట. అదేంటంటే అమ్మా మీరు భైరవద్వీపంలో అంబా శాంభవి అనే పాట పాడారు కదా అదే పాటను హిందీలో రీమేక్ చేస్తున్నారు కానీ మీ అంత హై స్వరంతో నేను పాడలేకపోయాను నన్ను క్షమించండి అని అన్నారట వాత్సల్యంతో.