News28th Jan 05:16 PMSunil Byrisetty1 min read

జనసేన ఎమ్మెల్యేపై విచారణ కమిటీ

రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందు

జనసేన ఎమ్మెల్యేపై విచారణ కమిటీ
రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో జనసేన పార్టీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన ఆరోపణలు, విడుదల చేసిన వీడియోల నేపథ్యంలో ఈ అంశంపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యుల కమిటీని నియమించింది. విచారణ పూర్తయ్యేంత వరకు శ్రీధర్‌ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని ఆదేశించింది. జనసేన పార్టీ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది. "తిరుపతి జిల్లా రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌పై ప్రసార మాధ్యమాలలో వచ్చిన వార్తలు, ఒక మహిళ చేసిన ఆరోపణలపై విచారణ చేయాలని పార్టీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయించింది" అని ప్రకటనలో పేర్కొంది. టి. శివశంకర్, తంబళ్ళపల్లి రమాదేవి, టి.సి. వరుణ్‌లతో కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఏడు రోజుల్లోగా కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్యే అరవ శ్రీధర్‌ను ఆదేశించారు. ఆరోపణల్లోని నిజానిజాలను విచారించి, వారం రోజుల్లోగా పార్టీకి నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించారు.
Andhra Pradesh Politics
Janasena Party
Arava Sridhar
Railway Koduru MLA
Inquiry Committee
Political Controversy
Party Action
పార్టీ చర్య
రాజకీయాలు
ఆరోపణలు
అధికారిక ప్రకటన
Scroll for the next article