Politics9th Sep 11:39 AMSunil Byrisetty1 min read
స్థానికంపై జనసేన వ్యూహం
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్‌లో మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు
జనసేన పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల అవగాహన కార్యక్రమం గుంటూరు జిల్లా తాడేపల్లిలోని అన్నపూర్ణ కన్వెన్షన్‌లో మొదలైంది. ఈ కార్యక్రమానికి రాష్ట్రంలోని అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలకు చెందిన స్థానిక సంస్థల ఎన్నికల కో ఆర్డినేటర్లు, కోఆర్డినేషన్ టీమ్ సభ్యులు, సపోర్ట్ టీమ్ సభ్యులు హాజరయ్యారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విధి విధానాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా స్థానిక ఎన్నికల్లో క్షేత్రస్థాయిలో అనుసరించాల్సిన వ్యూహాలు, పార్టీ శ్రేణుల సమన్వయం, ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కార్యాచరణపై కూడా చర్చ జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలకి పార్టీ శ్రేణులను క్షేత్రస్థాయిలో మరింత సన్నద్ధం చేయడంపై చర్చించనున్నారు.