News30th Aug 05:15 PMSunil Byrisetty1 min read
సుగాలి ప్రీతి కుటుంబానికి కూటమి ప్రభుత్వంలోనే న్యాయం
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు కు చెందిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అ
కూటమి ప్రభుత్వ హయాంలో కర్నూలు కు చెందిన సుగాలి ప్రీతి కుటుంబానికి న్యాయం జరుగుతుందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. గత కొన్ని రోజులుగా పదో తరగతి విద్యార్థిని సుగాలి ప్రీతి అంశంలో జనసేన, జనసేనానిపై వైసీపీ చేస్తున్న ఆరోపణలు, బాలిక తల్లి పార్వతిని తప్పుదోవ పట్టించి వ్యతిరేకంగా చేయిస్తున్న కామెంట్లు సరికావని మంత్రి కందుల దుర్గేష్ శనివారం ఒక ప్రకటనలో ఖండించారు. సుగాలి ప్రీతి మృతికి సంబంధించిన మిస్టరీని తేల్చే విషయంలో జనసేన తొలి నుంచి చిత్తశుద్ధితో ఉందని మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. నిందితులను కఠినంగా శిక్షించాలని, బాలిక కుటుంబానికి న్యాయం చేయాలని నాటి నుండి తాము డిమాండ్ చేస్తూ వస్తున్నామన్నారు. ర్యాలీ ఫర్ జస్టిస్ పేరుతో కర్నూలులో ర్యాలీని సైతం నిర్వహించామని గుర్తుచేశారు. బాలిక తల్లిదండ్రులు నాడు పార్టీ కార్యాలయానికి వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్ న్యాయం చేస్తామని ఇచ్చిన మాటకు కట్టుబడి ఉన్నామని చెప్పారు.జనసేన పోరాటంతోనే సుగాలి ప్రీతి కుటుంబానికి రూ.8 లక్షల ఆర్థిక సాయం, కర్నూలు సమీపంలో 5 సెంట్ల ఇంటి పట్టా, 5 ఎకరాల భూమి, బాలిక తండ్రికి రెవెన్యూశాఖలో ఉద్యోగం లభించాయన్నారు. చివరికి ప్రీతి తల్లి పార్వతి వైద్య ఖర్చులకు సైతం సాయం అందేలా కృషి చేశామన్నారు.