Politics15th Mar 03:49 PMSunil Byrisetty1 min read

బీజేపీలో జనసేన విలీనం.. కాంగ్రెస్ నేత సంచలనం

జన సేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి పవన్ కళ్యాణ్ కు సూచించారు. కాంగ్రెస్ పార

బీజేపీలో జనసేన విలీనం.. కాంగ్రెస్ నేత సంచలనం
జన సేన పార్టీని రద్దు చేసుకొని బీజేపీలో విలీనం చేయడం మంచిదని రాజ్య సభ మాజీ సభ్యులు, ఏపీసీసీ ముఖ్య అధికార ప్రతినిధి డాక్టర్ ఎన్ తులసి రెడ్డి పవన్ కళ్యాణ్ కు సూచించారు. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి ఏపీలో బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ అని చెబుతూ వచ్చిందన్నారు. బీజేపీ చేతిలో వీళ్ళు ముగ్గురూ కీలు బొమ్మలని, అది నిజమని నిన్నటి పిఠాపురం జన సేన సభ నిరూపించిందని తులసి రెడ్డి అన్నారు. తనకు పదవి పిచ్చి లేదని, సైద్ధాంతిక బలం వుందనీ పవన్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. పదవి పిచ్చి లేకుంటే ఉప ముఖ్యమంత్రి పదవి ఎందుకని ప్రశ్నించారు. సోదరుడు నాగబాబుకు MLC పదవి ఎందుకని అడిగారు. అసలు పవన్ సిద్ధాంతం ఏదని, చేగువేరా సిద్ధాంతమా? సనాతన ధర్మ సిద్ధాంతమా?లేక ఊసరవెల్లి సిద్ధాంతమా చెప్పాలని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కడప జిల్లాలో కాశినాయన ఆశ్రమాన్ని అటవీ శాఖ అధికారులు కూల్చడమేనా మీరు వల్లించే సనాతన ధర్మమని నిలదీశారు. పిఠాపురం సభ మొత్తం ఆత్మస్తుతి, పరనిందగా సాగిందని, సొంత డబ్బా వాయించుకోవడంతోనే సరిపోయిందని వ్యాఖ్యానించారు.
BJP
Janasena Party
Congress
జన సేన పార్టీ
బీజేపీ
Scroll for the next article