Politics6th Sep 11:44 AMSunil Byrisetty1 min read

జనసేన ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు

స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఈ మేరకు వేగంగా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తోంది. తాజాగా జిల్లా సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద నియమి

జనసేన ఎమ్మెల్యేకు కీలక బాధ్యతలు
స్థానిక సంస్థల ఎన్నికలకు జనసేన సిద్ధమవుతోంది. ఈ మేరకు వేగంగా నాయకులకు బాధ్యతలు అప్పగిస్తోంది. తాజాగా జిల్లా సమన్వయ కమిటీ కో-ఆర్డినేటర్ గా అవనిగడ్డ ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద నియమిస్తూ జనసేన అధిష్ఠానం ఉత్త ర్వులు జారీ చేసింది. మచిలీపట్నం పార్లమెంటు నియోజకవర్గంతో పాటు నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం కోఆర్డినేటర్ గాను ఆయనకు బాధ్యతలు అప్పగించారు. కృష్ణాజిల్లా సమన్వయ కమిటీలో సభ్యులుగా బండి రామకృష్ణ, పినిశెట్టి నాగచాయాదేవి, చిలకలపూడి పాపారావును నియమించారు. వీరికి సహాయకులుగా బచ్చు కృష్ణకుమారి, రత్నం నాగేశ్వరరావు, వేమూరి త్రినాథ్, మోకా రవి, ఎ.రాజ్యలక్ష్మి, పుల్లేటి దుర్గారావు, బొప్పన శివప్రసాద్ నియమితులయ్యారు.
Andhra Pradesh politics
Janasena Party
Mandali Buddhaprasad
Avanigadda MLA
Local Body Elections
Janasena Appointments
Krishna District
జనసేన నియామకాలు
కృష్ణాజిల్లా
మచిలీపట్నం
నరసాపురం
జిల్లా సమన్వయ కమిటీ
పవన్ కళ్యాణ్
Scroll for the next article