News6th Jun 06:12 PMSunil Byrisetty1 min read
మధుసూదన్ కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.50 లక్షల సాయం
మే నెలలో జమ్ముకశ్మీర్ లో విహారయాత్రకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామ
మే నెలలో జమ్ముకశ్మీర్ లో విహారయాత్రకు వెళ్లి పహల్గాం ఉగ్రదాడిలో మృతి చెందిన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ మధుసూదన్ రావు కుటుంబాన్ని పరామర్శించి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనల మేరకు వ్యక్తిగతంగా రూ.50 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లా కావలికి వెళ్లిన మంత్రి కందుల దుర్గేష్, టిడ్కో ఛైర్మన్ వేములపాటి అజయ్ కలిసి మధుసూదన్ కుటుంబీకులను కలిశారు. ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పిస్తామని ధైర్యం చెప్పారు. ఈ సందర్భంగా మధుసూదన్ ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు. కష్టాల్లో ఉన్న కుటుంబానికి జనసేన అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా 8వ తరగతి చదువుతున్న మధుసూదన్ కొడుకుకి రూ.22.50 లక్షలు, ఇంటర్మీడియట్ చదువుతున్న కూతురుకి రూ.22.50 లక్షలు, ఆయన తల్లిదండ్రులకు రూ. 5 లక్షలు ఆర్థికసాయం ప్రకటించగా తాము నేరుగా అందజేయడం జరిగిందని మంత్రి దుర్గేష్ వెల్లడించారు.