Politics12th Apr 10:37 AMSunil Byrisetty1 min read
జనసేన ఖాతాలో తొలి మునిసిపాలిటీ
రాష్ట్రంలో జనసేన పార్టీ ఖాతాలో తొలి మునిసిపాలిటీ చేరింది. మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చతురతతో నిడదవోలు మునిసిపాలిటీ పీఠాన్ని జనసేన కైవసం చేసుకుంది. నిడదవోలులో మొత్తం 28 కౌన్సిలర్ల
రాష్ట్రంలో జనసేన పార్టీ ఖాతాలో తొలి మునిసిపాలిటీ చేరింది.
మంత్రి కందుల దుర్గేష్ రాజకీయ చతురతతో నిడదవోలు మునిసిపాలిటీ పీఠాన్ని జనసేన కైవసం చేసుకుంది.
నిడదవోలులో మొత్తం 28 కౌన్సిలర్లకు జనసేన పార్టీకి ఒక్క కౌన్సిలర్ కూడా లేరు.
గడిచిన ఎన్నికల్లో వైసిపి 27 స్థానాల్లో విజయం సాధించగా, టిడిపి ఒక్క స్థానంలో గెలిచింది.
దీంతో.. వన్ సైడ్ గా వైసిపి ఈ మున్సిపాలిటీని సొంతం చేసుకుంది. కానీ ప్రస్తుతం పాలకులు మారారు.
మంత్రి కందుల దుర్గేష్ రాజకీయంగా వ్యవహరించిన తీరు కౌన్సిలర్లను ఆకర్షించి జనసేనలో చేరేందుకు ఉపకరించాయి.
తొలుత చైర్మన్, వైస్ చైర్మన్ తో పాటు మరో పదకొండు మంది వైసీపీ సభ్యులు జనసేనలో చేరిపోయారు.
దీంతో 13 మంది కౌన్సిలర్లు జనసేన పార్టీకి ఏర్పడ్డారు.
కూటమి భాగస్వామ్యంలో ఉన్న టిడిపి కౌన్సిలర్ ని కలుపుకుంటే 14 మంది బలం ఇక్కడ జనసేనకు చేరింది.
మంత్రిగా ఉన్న దుర్గేష్‌కి ఎక్స్ అఫీషియో మెంబర్ ఓటు హక్కు ఉండటంతో.. ఆ బలం 15కి పెరిగింది.
ఏప్రిల్ 3న మునిసిపల్ చైర్మన్‌పై అవిశ్వాసానికి తీర్మానం పెట్టాలంటూ వైసీసీ కౌన్సిలర్లు ఆర్డీవో, కలెక్టర్లకు వినతిపత్రాలు అందజేశారు.
అయితే.. ఇంతలోనే మరి కొంతమంది జనసేనలో చేరుకోవడంతో వారికి అవిశ్వాస తీర్మానానికి తగ్గ బలం కూడా సరిపడని పరిస్థితి ఏర్పడింది.
దీంతో అవిశ్వాస తీర్మానం వీగిపోయింది. ఈ క్రమంలో జనసేన పార్టీ ఇక్కడి చైర్మన్ పీఠాన్ని కైవసం చేసుకుంది.