News24th Aug 04:55 PMSunil Byrisetty1 min read

విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం

విశాఖలో 3 రోజులపాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆగస్ట్ 28 నుంచి 30 వరకు మూడు రోజులు విస్తృత స్థాయి సమావేశ

విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం
విశాఖలో 3 రోజులపాటు జనసేన విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. జనసేన పీఏసీ ఛైర్మన్, మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ ఆగస్ట్ 28 నుంచి 30 వరకు మూడు రోజులు విస్తృత స్థాయి సమావేశం విశాఖ లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ మూడు రోజులు పాటు *సేనతో సేనాని* పేరిట జరిగే కార్యక్రమంలో *జనసేన అధినేత పవన్ కళ్యాణ్* పాల్గొంటారన్నారు. 28న జనసేన లెజిస్లేటివ్ పార్టీ సమావేశం, మధ్యాహ్నం రాష్ట్ర కార్యవర్గ సమావేశం. 29న ఉదయం 10, మధ్యాహ్నం పార్లమెంట్ నియోజక వర్గాల వారిగా పదిమందితో చర్చ ఉంటుందని చెప్పారు. ఏడాది నుంచి అందించిన సుపరిపాలన మీద చర్చ జరుపుతామన్నారు. 30 వ తేదీ జనసేన మహా సభ మధ్యాహ్నం 1 గంట నుంచి సభ ప్రారంభమౌతుందని, సాయంత్రం 6 గంటలకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రసంగం ఉంటుందని వివరించారు.
Andhra Pradesh Politics
Janasena
Pawan Kalyan
Nadendla Manohar
Vizag Meeting
Janasena Maha Sabha
Senatho Senani
Janasena Legislative Party
State Executive Meeting
విశాఖలో జనసేన విస్తృత స్థాయి సమావేశం
Scroll for the next article