Politics14th Oct 01:13 PMSunil Byrisetty1 min read
జంతర్ మంతర్ కోసం రాహుల్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త పాట అందుకున్నారు. జంతర్ మంతర్ ప్రజల హక్కు అని, దాన్ని తిరిగి సాధిస్తామని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతూ జాతీ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కొత్త పాట అందుకున్నారు. జంతర్ మంతర్ ప్రజల హక్కు అని, దాన్ని తిరిగి సాధిస్తామని స్పష్టం చేశారు. జంతర్ మంతర్ వద్ద శాంతియుతంగా నిరసన తెలుపుతూ జాతీయ జెండాను ప్రదర్శించడం నేరం కాదని పేర్కొన్నారు. ఈ కారణంతో యువతను జైలుకు పంపడం పిరికిపంద చర్య అని కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. కాక్రోచ్ జనతా పార్టీ నేతలు సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాలను ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీకి పంపిన నేపథ్యంలో రాహుల్ గాంధీ ఈ వ్యాఖ్యలు చేశారు. విద్యార్థులు, యువత, జర్నలిస్టులు, ఇండియా కూటమి.. వేర్వేరు బ్యానర్లతో నిరసనలు చేపట్టినా, రాజ్యాంగం కల్పించిన హక్కుల కోసం గొంతెత్తడమే అందరి ఉమ్మడి లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.