International25th Sep 09:00 AMSunil Byrisetty1 min read
అక్కడ రెండు గంటల కన్నా ఫోన్ వాడకూడదు!
ప్రపంచానికి వైరస్ లా మారిన స్మార్ట్‌ఫోన్ వాడకంపై జపాన్‌లోని ఓ నగరం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలు వినోదం కోసం స్మార్ట్‌ఫోన్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల వాడకాన్ని రోజుకు క
ప్రపంచానికి వైరస్ లా మారిన స్మార్ట్‌ఫోన్ వాడకంపై జపాన్‌లోని ఓ నగరం వినూత్న నిర్ణయం తీసుకుంది. ప్రజలు వినోదం కోసం స్మార్ట్‌ఫోన్‌లు, పర్సనల్ కంప్యూటర్లు, టాబ్లెట్ల వాడకాన్ని రోజుకు కేవలం రెండు గంటలకు పరిమితం చేయాలని కోరుతూ ఒక ఆర్డినెన్స్‌ను ఆమోదించింది. ఐచి రాష్ట్రంలోని టోయోవాకే మున్సిపల్ అసెంబ్లీ ఈ మేరకు మెజారిటీ ఓటుతో తీర్మానం చేసింది. జపాన్‌లో ఇలాంటి నిబంధన తీసుకువచ్చిన తొలి నగరంగా టోయోవాకే నిలిచింది.
ఈ కొత్త నిబంధన అక్టోబర్ 1 నుంచి అమల్లోకి రానుంది. అయితే, ఇది కేవలం ఒక మార్గదర్శకం మాత్రమేనని, దీన్ని ఉల్లంఘించిన వారిపై ఎలాంటి జరిమానాలు విధించబోమని స్పష్టం చేసింది. చదువు, ఆఫీస్ పనులు, ఇంటి పనుల కోసం ఎలక్ట్రానిక్ పరికరాలను వాడుకోవడానికి ఈ నిబంధన నుంచి మినహాయింపు ఇచ్చారు. "ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే మా ప్రధాన లక్ష్యం. స్మార్ట్‌ఫోన్ల వాడకం వల్ల నిద్రలేమి వంటి సమస్యలు వస్తున్నాయో లేదో ప్రజలు గమనించుకోవాలి. మేము స్మార్ట్‌ఫోన్‌లను వ్యతిరేకించడం లేదు, కానీ వాటి వాడకంలో పరిమితులు ఉండాలని కోరుతున్నాం" అని తెలిపారు.