National1st Sep 12:17 PMSunil Byrisetty1 min read
రక్షణ శాఖలోకి జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్స్
దేశ సరిహద్దులను ఆనుకుని చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఈ 3 దేశాలు మన దేశంతో నేరుగా భూభాగాన్ని పంచుకుంటున్నాయి. అందుకే ఈ మూడు దేశాలు పెద్ద సంఖ్యలో యుద్ద ట్యాంకులను మన దేశ
దేశ సరిహద్దులను ఆనుకుని చైనా, పాకిస్థాన్, బంగ్లాదేశ్ లు ఉన్నాయి. ఈ 3 దేశాలు మన దేశంతో నేరుగా భూభాగాన్ని పంచుకుంటున్నాయి. అందుకే ఈ మూడు దేశాలు పెద్ద సంఖ్యలో యుద్ద ట్యాంకులను మన దేశ సరిహద్దుల వద్ద మోహరిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు కాకపోయినా భవిష్యత్తులో మన దేశం మీదకు యుద్ద ట్యాంకులతో విరుచుకుపడే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక్క షాట్ లో ఈ యుద్ద ట్యాంకులను బద్దలు కొట్టగల యాంటీ ట్యాంకు మిసైల్ సిస్టమ్స్ ను మన దేశంలోనే తయారు చేయిస్తోంది. అవే అమెరికన్ జావెలిన్ యాంటీ ట్యాంక్ మిసైల్ సిస్టమ్స్. ఈ జావెలిన్ సంస్థ, మన టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ లిమిటెడ్ తో కలిసి మోస్ట్ అడ్వాన్స్‌డ్ జ్యావెలిన్ ఆల్ అప్ రౌండ్ యాంటీ-ట్యాంక్ గైడెడ్ మిస్సైళ్లను తయారు చేయనున్నారు. ఇవి ఫైర్ & ఫర్‌గెట్ మిసైల్స్. అంటే ఒక్కసారి ఫైర్ చేస్తే ఇక టార్గెట్ కచ్చితంగా బద్దలయిపోతుంది. మేకిన్ ఇండియాలో భాగంగా ఇవి సిద్ధమవుతున్నాయి.