News12th Mar 12:18 PMSunil Byrisetty1 min read

అమెరికాకు, భారత్‌కు యుద్ధం కాదు: జయప్రకాష్ నారాయణ

అమెరికా నుంచి భారత్‌కు పంపిస్తున్న వలసదారుల అంశంపై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పందించారు. అక్రమంగా ప్రవేశించిన వారిని అమెరికా తమ దేశం నుంచి పంపే విషయంలో ఎలా

అమెరికాకు, భారత్‌కు యుద్ధం కాదు: జయప్రకాష్ నారాయణ
అమెరికా నుంచి భారత్‌కు పంపిస్తున్న వలసదారుల అంశంపై లోక్ సత్తా వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ స్పందించారు. అక్రమంగా ప్రవేశించిన వారిని అమెరికా తమ దేశం నుంచి పంపే విషయంలో ఎలా వ్యవహరించాలో ఆ దేశ నిబంధనల ప్రకారం జరుగుతాయన్నారు. అదే ఆయా దేశాలు తమ ప్రజలను విమానాల్లో తెచ్చుకుంటే వేరే విధంగా ఉంటుందన్నారు. అక్రమంగా ప్రవేశించిన వారు విమానాల్లో ఏదైనా దుందుడుకుగా వ్యవహరిస్తే జరిగే పరిణామాల నేపథ్యంలోనే సంకెళ్లు వేసి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. మన దేశంలో ప్రజలకు ఏ రకమైన సౌకర్యాలు, సదుపాయాలు అందుతున్నాయో అవే విదేశాలకు వలస వెళ్లిన వారికీ వర్తిస్తాయన్నారు. లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టుకుని వెళ్లిన వారిని తీసుకొచ్చేందుకు ప్రత్యేక ఖర్చు చేసే పరిస్థితి లేదన్నారు. 145 కోట్ల మంది నివసిస్తున్నపేద భారత దేశం అంత వ్యయం భరించలేదన్నారు. విజయ్ మాల్యా, నీరవ్ మోదీలాంటి వారు విదేశాల్లో న్యాయస్థానాలను ఆశ్రయించి బెయిల్ తెచ్చుకుంటున్నారని చెప్పారు. వారిని స్వదేశానికి తీసుకు రావాలన్నా ఆయా దేశాల చట్టాల ప్రకారం అంత తేలిక కాదన్నారు. భారత్‌పై సుంకాలు పెంచుతామన్న ట్రంప్ వ్యాఖ్యలపై మాట్లాడుతూ నిలకడలేనితనమని వ్యాఖ్యానించారు. ఉదయం ఒక మాట చెబితే మధ్యాహ్నం మరోమాట, సాయంత్రం ఇంకో మాట చెబుతున్నారని, ట్రంప్ విదేశీ వ్యవహారాలపై ఈ రకంగా స్పందిస్తుండటం గందరగోళానికి తావిస్తోందని అభిప్రాయపడ్డారు. ఇదేమీ అమెరికాకు, భారత్‌కు మధ్య యుద్ధమేమీ కాదని జయప్రకాష్ అన్నారు.
Jaya Prakash Narayana
America
India
అమెరికా
భారత్‌
జయప్రకాష్ నారాయణ
Scroll for the next article