Politics23rd Jan 04:54 PMSunil Byrisetty1 min read

హోంమంత్రిపై జేసీ అసంతృప్తి

టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన విమర్శల బాణం హోం మంత్రి వంగలపూడి అనితపై ఎక్కుపెట్టారు. “నా గన్ లైసెన్సు

హోంమంత్రిపై జేసీ అసంతృప్తి
టీడీపీ సీనియర్ నాయకుడు, తాడిపత్రి మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి మళ్ళీ వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన విమర్శల బాణం హోం మంత్రి వంగలపూడి అనితపై ఎక్కుపెట్టారు. “నా గన్ లైసెన్సు పరిస్థితే ఇలా ఉంటే, సామాన్య కార్యకర్తల గతేంటి?” అంటూ ఆయన ప్రశ్న సంధించారు. తన గన్ లైసెన్స్ రెన్యూవల్ విషయంలో హోం మంత్రి వంగలపూడి అనిత అనుసరిస్తున్న తీరుపై ఆయన బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. జేసీ ప్రభాకర్ రెడ్డి గత కొంతకాలంగా తన గన్ లైసెన్సును రెన్యూవల్ చేయించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. దీనిపై పలుమార్లు హోం మంత్రి అనితకు లేఖలు రాసినా, అధికారులను సంప్రదించినా స్పందన లేదని ఆరోపిస్తున్నారు. “అనితమ్మా.. ఇది నా తప్పో, నీ తప్పో లేక పోలీసుల తప్పో నాకు తెలియదు. కానీ ఇది నన్ను, మా స్థానిక ఎమ్మెల్యేను అవమానించడమే. ఒక మున్సిపల్ ఛైర్మన్‌గా, అధికార పార్టీ సీనియర్ నేతగా నా పరిస్థితే ఇలా ఉంటే, క్షేత్రస్థాయిలో పార్టీ కోసం రక్తం చిందించిన కార్యకర్తల పరిస్థితి ఏమిటి?” అని జేసీ ప్రశ్నించారు.
Andhra Pradesh politics
JC Prabhakar Reddy
TDP Senior Leader
Tadipatri Municipal Chairman
Home Minister Vangalapudi Anitha
Gun License Renewal
లైసెన్స్ రెన్యూవల్
రాజకీయ అసంతృప్తి
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు
Scroll for the next article