Politics8th Jan 01:35 PMSunil Byrisetty1 min read

మాజీ ఎమ్మెల్యేపై చెప్పుతో అంటూ.. జేసీ ఫైర్

ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ పౌరుషంపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కేతిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర

మాజీ ఎమ్మెల్యేపై చెప్పుతో అంటూ.. జేసీ ఫైర్
ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి రాయలసీమ పౌరుషంపై చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని రేపాయి. కేతిరెడ్డి వ్యాఖ్యలపై తాడిపత్రి మున్సిపల్ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. రాయలసీమకు పౌరుషం లేదని మాట్లాడితే ప్రజలు చెప్పులతో కొడతారని హెచ్చరించారు. తాను కూడా రాయలసీమ బిడ్డనేనని, తనకు పౌరుషం ఉందని చెప్పుకొచ్చారు. కేతిరెడ్డి కుటుంబానికే పౌరుషం లేదని విమర్శించారు. ధర్మవరంలో కేతిరెడ్డి చేసిన అభివృద్ధి ఏంటో చెప్పాలని డిమాండ్ చేశారు. గుడ్ మార్నింగ్ అంటూ షో చేయడం తప్ప ప్రజలకు ఏం చేశారని ఎద్దేవా చేశారు. కేతిరెడ్డి వద్ద ఉన్న కార్లు, గుర్రాలు ఎక్కడి నుంచి వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు.
Andhra Pradesh Politics
Rayalaseema
Kethireddy Venkatarami Reddy
JC Prabhakar Reddy
Dharmavaram
తాడిపత్రి
రాజకీయ వివాదం
వైసీపీ
వ్యాఖ్యల దుమారం
Scroll for the next article