News15th Oct 12:01 PMSunil Byrisetty1 min read
జేసీ రాహుల్ మీనాకు ఘన వీడ్కోలు
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు జిల్లా అధికారి యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు. జేసీగా కాకినాడ జిల్లాకు అం
రాజమహేంద్రవరం నగరపాలక సంస్థకు కమిషనర్ గా బదిలీపై వెళ్తున్న కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాకు జిల్లా అధికారి యంత్రాంగం ఘనంగా వీడ్కోలు పలికారు. జేసీగా కాకినాడ జిల్లాకు అందించిన సేవలను గుర్తు చేసుకున్నారు. రాజమహేంద్రవరంలో మరింత సేవలందించాలని ఆకాంక్షించారు. కాకినాడ కలెక్టరేట్లో జేసీ రాహుల్ మీనా కు వీడ్కోలు కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సగిలి, జిల్లా ఎస్పీ జి.బిందు మాధవ్, అసిస్టెంట్ కలెక్టర్ మనీష, జిల్లా స్థాయి అధికారులు అన్ని మండలాల తహశీల్దార్లు ఈ సందర్భంగా రాహుల్ మీనాను ఘనంగా సత్కరించారు. కాకినాడ జిల్లా జాయింట్ కలెక్టర్ గా 16 నెలల పాటు ఉత్తమ సేవలు అందించారని కొనియాడారు.