News9th Oct 10:12 AMSunil Byrisetty1 min read

విజయవాడ ఉత్సవ్‌లో జిజ్ఞాస పోటీలు

సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిజ్ఞాస నిర్వహిస్తున్న

విజయవాడ ఉత్సవ్‌లో జిజ్ఞాస పోటీలు
సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ ఆధ్వర్యంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పర్యాటక శాఖ సహకారంతో నిర్వహిస్తున్న విజయవాడ ఉత్సవ్–2.0లో భాగంగా కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో జిజ్ఞాస నిర్వహిస్తున్న సాంస్కృతిక, కళా పోటీలు గురువారం తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఘనంగా ప్రారంభమయ్యాయి. జిజ్ఞాస ఆధ్వర్యంలో మొత్తం ఏడు విభాగాల్లో 100కు పైగా పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయగా, ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా 6,000 మందికి పైగా పోటీల్లో పాల్గొనేందుకు నమోదు చేసుకున్నారని జిజ్ఞాస ప్రతినిధులు తెలిపారు. తొలి రోజు నుంచే చిన్నారులు, యువత, పెద్దలు ఉత్సాహంగా పోటీల్లో పాల్గొని తమ ప్రతిభను ప్రదర్శించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ.. విజయవాడ ఉత్సవ్ ద్వారా నగరంలోని కళా, సాంస్కృతిక ప్రతిభను వెలికితీసేందుకు జిజ్ఞాస నిర్వహిస్తున్న పోటీలు ఎంతో అభినందనీయమని అన్నారు. చిన్నారులు, యువత తమలోని ప్రతిభను ప్రదర్శించేందుకు చక్కటి వేదిక అన్నారు.
Scroll for the next article