Business Type24th Oct 12:41 PMSunil Byrisetty1 min read
జియో ఐపీవో సరికొత్త చరిత్ర !
రిలయన్స్ గ్రూప్ జియో గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్లలో ప్రభంజనం సృష్టించింది. పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ ముగింపు నాటికి ఏకంగా కోటిన్నర కి పైగా ఇన్వెస్టర్ దరఖాస్తులను సాధించి ప్రపంచంలోనే
రిలయన్స్ గ్రూప్ జియో గ్లోబల్ క్యాపిటల్ మార్కెట్లలో ప్రభంజనం సృష్టించింది. పబ్లిక్ ఇష్యూ బిడ్డింగ్ ముగింపు నాటికి ఏకంగా కోటిన్నర కి పైగా ఇన్వెస్టర్ దరఖాస్తులను సాధించి ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన మొట్టమొదటి సంస్థగా జియో నిలిచింది. గతంలో వారీ ఎనర్జీస్ పేరిట ఉన్న 97.3 లక్షల దరఖాస్తుల ఆల్టైమ్ వరల్డ్ రికార్డును అధిగమించిన జియో, అంతర్జాతీయ ఆర్థిక చరిత్రలోనే సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. బిజినెస్ వర్గాల గణాంకాల ప్రకారం.. మొత్తం ఇష్యూ దాదాపు 22.19 రెట్లు ఓవర్సబ్స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయ్యర్స్ , నాన్-ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు , రిటైల్ ఇండివిజువల్ ఇన్వెస్టర్లు సహా అన్ని విభాగాల నుంచి భారీ స్థాయిలో స్పందన లభించింది.