News18th Oct 11:02 AMSunil Byrisetty1 min read

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్ ఛార్ట్

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా స

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి జాబ్ ఛార్ట్
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది విధుల నిర్వహణపై ప్రభుత్వం కీలక ఆదేశాలు జారీచేసింది. ఒకే సమయంలో ఒకటి కంటే ఎక్కువ పనులు వారికి అప్పగిస్తూ వివిధ శాఖలు ఆదేశాలు జారీ చేస్తున్నాయంటూ ఆయా సంఘాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై స్పందించి నిర్దిష్టమైన జాబ్ ఛార్ట్ ను విడుదల చేసింది. సాధారణ జాబ్ ఛార్ట్ ప్రకారం ఉద్యోగులు గ్రామ, వార్డుస్థాయి అభివృద్ధి ప్రణాళికల పనులన్నింటిలో పాల్గొనాలి. ప్రభుత్వ పథకాల సమర్థ అమలుకు ఆయా పథకాల విస్తరణ కార్యక్రమాల్లో పాల్గొనాలి. ప్రభుత్వ ఆదేశాల మేరకు వారి పరిధిలోని పౌరుల సమాచారాన్ని సేకరించాలి. ప్రభుత్వం ప్రజలకు అందించే వివిధ సేవలు, సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దే అందించాలి. గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారానికి నిరంతర అనుశీలన చేపట్టాలి. విపత్తు సమయాల్లో అత్యవసర విధులు నిర్వర్తించాలి. ప్రభుత్వం సమయానుసారం జారీ చేసే ఆదేశాలకు అనుగుణంగా వారికి అప్పగించే ఏ పనులైనా నిర్వర్తించాలి. ప్రభుత్వం నిర్ణయించిన పరీక్షలకు అర్హత సాధించాలి. ఈ జాబ్ ఛార్ట్ అమలు బాధ్యతను జిల్లా కలెక్టర్లు లేదా నియామక అధికారులు తీసుకోవాలి. ఈ విధులను అమలుచేయకపోతే వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలి.
Andhra Pradesh Government
Village Secretariat
Ward Secretariat
Job Chart
Employee Duties
Development Programs
Welfare Schemes
విపత్తు నిర్వహణ
జిల్లా కలెక్టర్లు
క్రమశిక్షణ చర్యలు
జాబ్ ఛార్ట్
Scroll for the next article