Jobs30th Sep 05:11 PMSunil Byrisetty1 min read

యువతకు ఉద్యోగాల కల్పనే ఎజెండా

'యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం ఉద్యోగాల కల్పన. అందుకే మా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి నుంచి చివరి స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఉద్యోగాల

యువతకు ఉద్యోగాల కల్పనే ఎజెండా
'యువత మమ్మల్ని అడుగుతున్న ఒకే ఒక్క విషయం ఉద్యోగాల కల్పన. అందుకే మా ప్రభుత్వం ఉద్యోగాల కల్పనే ప్రధాన ఎజెండాగా పెట్టుకుంది. ముఖ్యమంత్రి నుంచి చివరి స్థాయి ఉద్యోగి వరకు అందరూ ఉద్యోగాల సృష్టిపైనే పనిచేస్తున్నారు. యువత కలల సాకారం కోసమే 20 లక్షల ఉద్యోగాల లక్ష్యం నిర్ణయించామ'ని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. కొచ్చిలో జరిగిన ఇండియా టుడే కాంక్లేవ్ సౌత్ 2026లో లోకేష్ పాల్గొన్నారు. ఇండియా టుడే కన్సల్టింగ్ ఎడిటర్ రాజ్ దీప్ సర్దేశాయ్ అఢిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. డీఎస్సీపై రాజకీయ నిరుద్యోగులే లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు, వాస్తవానికి వారు ఆరోపిస్తున్న స్పోర్ట్స్ సర్టిఫికెట్లన్నీ గత వైసీపీ ప్రభుత్వంలో జారీచేసినవేనన్నారు. 'క్వాంటమ్ అనేది ఊహ కాదు, నెక్ట్స్ జెన‌రేష‌న్‌ టెక్నాలజీ. ఆంధ్రప్రదేశ్ దాన్ని అందిపుచ్చుకుంది. తొలి 156 బిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నాం. దానిపై పరిశోధనలు, మెటీరియల్ సైన్స్, క్రయోజెనిక్ టెక్నాలజీ వంటి రంగాల్లో పని చేసి క్వాంటమ్ ఎకోసిస్టమ్‌ను నిర్మించాలనుకుంటున్నామ'ని చెప్పారు.
Scroll for the next article