Jobs15th Jul 12:37 PMSunil Byrisetty1 min read

18న కేశినేని ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో జాబ్ మేళా

కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల‌ 18వ తేదీ నిర్వ‌హించ‌నున్న జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని

18న కేశినేని ఫౌండేషన్ ఆధ్వ‌ర్యంలో జాబ్ మేళా
కేశినేని ఫౌండేష‌న్ ఆధ్వ‌ర్యంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ ఈ నెల‌ 18వ తేదీ నిర్వ‌హించ‌నున్న జాబ్ మేళాకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన‌ట్లు విజ‌య‌వాడ ఎంపీ కేశినేని శివ‌నాథ్ (చిన్ని) తెలిపారు. జాబ్ మేళాకు సంబంధించిన పోస్ట‌ర్ల‌ను ఎంపీ కేశినేని శివ‌నాథ్, ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ ఆవిష్క‌రించారు. ఎంపీ కేశినేని మాట్లాడుతూ విజ‌య‌వాడ‌, మొగ‌ల్రాజ‌పురంలోని పి.బి. సిద్ధార్థ కాలేజీ ఆఫ్ ఆర్ట్స్ అండ్ సైన్స్ ప్రాంగ‌ణంలో ఈ నెల 18వ తేదీ శుక్ర‌వారం ఉద‌యం 9 గంట‌ల నుంచి సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు జాబ్ మేళా జ‌రుగుతుంద‌ని తెలిపారు. యువ‌త‌కు సుస్థిర ఉద్యోగ అవ‌కాశాల‌ను క‌ల్పించేందుకు జాబ్ మేళాను నిర్వ‌హిస్తున్న‌ట్లు తెలిపారు. జాబ్ మేళాకు హాజ‌ర‌య్యే అభ్య‌ర్థులు ముందుగా ఆన్ లైన్ లో రిజిస్ట్రేష‌న్ లింకు http://naipunyam.ap.gov.in/user-registration లో న‌మోదు చేసుకోవాల‌ని పేర్కొన్నారు. ఎస్ఎస్‌సీ, ఇంట‌ర్‌, ఐటీఐ, డిప్లొమా, ఏదైనా డిగ్రీ, బీటెక్‌, పీజీ పూర్తిచేసిన అర్హ‌త ఉన్న‌వారికి వివిధ కంపెనీలు ఉద్యోగావ‌కాశాలు క‌ల్పించ‌నున్న‌ట్లు ఎమ్మెల్యే గ‌ద్దె రామ్మోహ‌న్ వివ‌రించారు. జాబ్ మేళాను స‌ద్వినియోగం చేసుకునేందుకు ఎలాంటి రుసుం చెల్లించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఆయ‌న వివ‌రించారు.
Andhra Pradesh
Vijayawada
MP Kesineni Sivanath
job fair
Ap State Skill Development Organization
P.B. Siddhartha College
జాబ్ మేళా
Scroll for the next article