Jobs11th Sep 11:09 AMSunil Byrisetty1 min read

15న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా

రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 15 న ఉదయం 10 గంటలకు రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి

15న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా
రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆధ్వర్యంలో వారం వారం నిర్వహించే జాబ్ మేళాలో భాగంగా ఈ నెల 15 న ఉదయం 10 గంటలకు రామచంద్రపురంలోని ఉపాధి భవన్లో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ జాబ్ మేళాలో టెక్ మహీంద్రా, టెలిపెర్ఫార్మన్స్, హేక్సవెర్, ఆల్ట్రూఈస్ట్ కంపెనీలలో కస్టమర్ రిలేషన్షిప్, కస్టమర్ సపోర్ట్, వెబ్ చాట్ మరియు చాట్ ప్రాసెస్ పోస్టుల కొరకు ఇంటర్వ్యూలు నిర్వహించబడుతున్నవి. 2020 నుండి 2025 ఏదైనా డిగ్రీలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఈ పోస్టులకు అర్హులు. ఎంపికైన వారు సుమారు 18 నుండి 30 వేలు జీతముతో చెన్నై, హైదరాబాద్, బెంగుళూరు లలో పనిచేయవలసి ఉంటుంది. రామచంద్రపురం కేవీర్ హాస్పిటల్ వెనుక గల ఉపాధి భవన్ నందు ఈ ఇంటర్వ్యూలు నిర్వహించబడతాయి. మంత్రి సుభాష్ ఆశయం, ఆదేశాలు మేరకు సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం, ఉపాధి ప్రాజెక్ట్ డైరెక్టర్ రాంకుమార్ సమక్షంలో జరిగే ఈ జాబ్ మేళా మరిన్ని వివరములు కోసం 9948919949 , 9515481671 నెంబర్ లో సంప్రదించగలరు.
Andhra Pradesh
Job Mela
Ramachandrapuram
Employment
Career Opportunities
Tech Mahindra
Teleperformance
Hexaware
Altruist
Customer Support Jobs
Web Chat Jobs
Freshers Jobs
Scroll for the next article