Jobs18th Sep 03:32 PMSunil Byrisetty1 min read
ఈనెల 23న రామచంద్రపురంలో ఉద్యోగ మేళా
నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 49 & 50 వ జాబ్ మేళా ఈ నెల 23
నిరుద్యోగ సమస్య నిర్మూలన కోసం రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్, సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ అధినేత వాసంశెట్టి సత్యం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న 49 & 50 వ జాబ్ మేళా ఈ నెల 23 న తేదీన ఉదయం 10:00 నుండి కెవిఆర్ హాస్పిటల్ వద్ద గల ఉపాధి ఆఫీసులో జాబ్ మేళా జరుగుతుందని మంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 18 నుంచి 35 సంవత్సరాలలో టెన్త్, ఇంటర్ , ఐటిఐ, డిప్లమా, డిగ్రీ , బీటెక్, అభ్యర్థులకు శ్రీ సిటీ, బెంగళూరు, హైదరాబాదు, విజయవాడలో వివిధ పోస్టుల కొరకు టాటా ఎలక్ట్రానిక్స్, టాటా వెస్ట్రన్, ఓయ్ ప్రొటెక్ట్, ప్రికాల్, నెట్ ఆన్, ఫైవ్ లాక్స్, ఫ్లిప్కార్ట్ , రివర్ వంటి సుమారు 8 కంపెనీలలో అసెంబ్లింగ్ ఆపరేటర్, ప్రొడక్షన్,క్వాలిటీ, డిపార్ట్మెంట్లలో ఆపరేటర్, ఎగ్జిక్యూటివ్స్, టెక్నీషియన్స్ ఉద్యోగాల కొరకు జాబ్ మేళా నిర్వహించ బడును. ఎంపికైన అభ్యర్థులకు 15000 నుంచి 2O వేల జీతం లభించును. అలాగే పిఎఫ్ ,ఈఎస్ఐ ,భోజన, వసతి, రవాణా, సదుపాయము ఆ కంపెనీలు ఆధారంగా లభించును. అర్హులైన నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సత్యం వాసంశెట్టి ఫౌండేషన్ చైర్మన్ వాసంశెట్టి సత్యం కోరారు. మిగిలిన వివరములకు 7075704852 7075904852 నెంబర్లను సంప్రదించగలరు.