Education18th Jun 01:06 PMSunil Byrisetty1 min read

18న పామర్రులో జాబ్ మేళా..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 09:00 గంటలకు పామర్రులోని SKRR ZPH School

18న పామర్రులో జాబ్ మేళా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో, జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించుటకు ఈనెల 18వ తేదీ బుధవారం ఉదయం 09:00 గంటలకు పామర్రులోని SKRR ZPH School ఎదురు గల ఆరేపల్లి కళ్యాణ మండపం నందు "జాబ్ మేళా” నిర్వహించనున్నట్లు ఎమ్మెల్యే వర్ల కుమార్ రాజా తెలియజేసారు. మేళాలో, హెటిరో ల్యాబ్స్ లిమిటెడ్, ముత్తూట్ ఫైనాన్స్ లిమిటెడ్, సుధీర్ టింబర్స్ ప్రైవేట్ లిమిటెడ్, బజాజ్ ఫిన్సర్వ్ లిమిటెడ్, టాటా క్యాపిటల్, వరుణ్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్, అపోలో ఫార్మసి, పేటిఎమ్ వంటి ప్రముఖ కంపెనీల వారు పాల్గొంటున్నారని ఉపాధి అధికారి/డిజిగ్నేటెడ్ ఆఫీసర్ డి.విక్టర్ బాబు వివరించారు. టెన్త్, ఇంటర్, ఐటిఐ, డిప్లొమా, డిగ్రీ, బి.ఫార్మసి, పీజి పూర్తిచేసిన 18 నుంచి 35 సంవత్సరాలలోపు యువత అర్హులని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ముందుగా https://naipunyam.ap.gov.in/user-registration లింక్ నందు రిజిస్టరై, జాబ్ మేళాకు రెజ్యూములతో రావాలన్నారు. వివరాలకు 80743 70846, 63006 18985, 79813 68429 నంబర్లను సంప్రదించాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి Dr. పి.నరేష్ కుమార్ వివరించారు.
Education
Job Mela
Vijayawada
pammaru Skrr zph school
ఈ నెల 18న పామర్రులో జాబ్ మేళా
పామర్రు నియోజకవర్గం
Scroll for the next article