News14th Oct 01:05 PMSunil Byrisetty1 min read

కూటమి కొలువుల జాతర

మాట ఇస్తే నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ మార్క్ పాలన అని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట

కూటమి కొలువుల జాతర
మాట ఇస్తే నిలబెట్టుకోవడమే కూటమి ప్రభుత్వ మార్క్ పాలన అని టీడీపీ సీనియర్ నాయకులు ఎస్వీఎస్ఎన్ వర్మ స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ సారథ్యంలో రాష్ట్రంలో విద్యా వ్యవస్థ ప్రక్షాళన జరుగుతూ, నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు ఊపందుకున్నాయని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో నిరుద్యోగులు నరకం చూశారని, నాడు ఒక్క జాబ్ క్యాలెండర్ గానీ, డీఎస్సీ గానీ ఇవ్వకుండా యువత భవితను నాశనం చేశారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 150 రోజుల్లోనే మెగా డీఎస్సీ ద్వారా 16,347 ఉపాధ్యాయ ఉద్యోగాలను అత్యంత పారదర్శకంగా, ప్రతిభ ఆధారంగా భర్తీ చేసి నిరుద్యోగుల ఇళ్లలో వెలుగులు నింపామని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ యువత సంక్షేమానికి కూటమి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు.
Scroll for the next article