Jobs24th Jan 12:36 PMSunil Byrisetty1 min read

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగాలు

ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేసినవారికి రష్యాలో షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగాకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.మనోహర్

ఐటీఐ, డిప్లొమా అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగాలు
ఐటీఐ, డిప్లొమా కోర్సులు చేసినవారికి రష్యాలో షీట్ మెటల్ వర్కర్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్ ఉద్యోగాకాశాలు కల్పిస్తున్నట్లు నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డి.మనోహర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఒక సంవత్సరం ఒప్పందంతో ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నారని, తర్వాత ఒప్పందాన్ని పొడిగించే అవకాశం ఉందని పేర్కొన్నారు. నెలకు 60వేల రూబుళ్లు (సుమారు రూ.72వేలు) జీతం వస్తుందని, అదనంగా ఆహార భత్యం కింద మరో 10 వేల రూబుళ్లు ఇస్తారని తెలిపారు. ఉచిత వసతి కల్పిస్తారని, విమాన ప్రయాణ ఖర్చులు, తిరిగి వచ్చేటప్పుడు ప్రయాణ ఖర్చులు కంపెనీయే భరిస్తుందన్నారు. ఉచిత వైద్య బీమా సౌకర్యం కూడా ఉంటుందని వివరించారు. అభ్యర్థులు https://naipunyam.ap.gov.in/ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనీ, వివరాలకు: 9988853335, 8712655686 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.
Andhra Pradesh
Naipunyam portal
ITI jobs
Diploma jobs
Russia employment
Overseas jobs
Skilled workers
Welding jobs
Machinist jobs
Fitter jobs
Sheet metal worker
Skill development
Scroll for the next article