Jobs31st Jan 12:42 PMSunil Byrisetty1 min read

ఉద్యోగ ఉగాది.. జాబ్ క్యాలెండర్‌కు కసరత్తు!

ఏపీలో నిరుద్యోగ యువతకు సర్కార్ శుభవార్త చెప్పనుంది.లక్షలాది మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. ‘జాబ్ క్యాలెండర్’ అనే బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చ

ఉద్యోగ ఉగాది.. జాబ్ క్యాలెండర్‌కు కసరత్తు!
ఏపీలో నిరుద్యోగ యువతకు సర్కార్ శుభవార్త చెప్పనుంది.లక్షలాది మంది అభ్యర్థులకు కూటమి ప్రభుత్వం తీపి కబురు అందించేందుకు సిద్ధమైంది. ‘జాబ్ క్యాలెండర్’ అనే బృహత్తర ప్రణాళికకు శ్రీకారం చుడుతోంది. ఉగాది నుంచి ఏటా క్రమబద్ధంగా ఉద్యోగాల భర్తీ చేపట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే మెగా డీఎస్సీ, పోలీస్ నియామకాల్లో వేగం చూపిన సర్కార్, ఇప్పుడు అన్ని శాఖల్లోని ఖాళీలను ఒక్కతాటిపైకి తెస్తోంది. అసలు ఏయే శాఖల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి? ఆర్థిక శాఖ ఆమోదం పొందిన పోస్టులెన్ని అనేది లెక్కలు తీస్తోంది. ఆర్థిక శాఖ ఆధ్వర్యంలోని ‘నిధి’ పోర్టల్ ద్వారా రాష్ట్రంలోని ప్రతి శాఖలో మంజూరైన పోస్టులు, ఖాళీలు, కాంట్రాక్టు ఉద్యోగుల వివరాలను ప్రభుత్వం సేకరిస్తోంది. ఇప్పటి వరకు 157 విభాగాలు తమ వద్ద ఉన్న ఖాళీల వివరాలను ధృవీకరించాయి. దీని ప్రకారం కేవలం నేరుగా నియామకాల ద్వారా భర్తీ చేయాల్సిన పోస్టులే 99,000 వరకు ఉన్నట్లు తేలింది.
Andhra Pradesh
Job Calendar
Employment
Unemployment
Youth Jobs
Government Jobs
Coalition Government
Mega Recruitment
DSC
Police Recruitment
Finance Department
Scroll for the next article