Jobs24th Sep 03:54 PMSunil Byrisetty1 min read

ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజం

యువతకు ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం, చంద్

ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజం
యువతకు ఉద్యోగాలు కూటమి నైజం.. రౌడీయిజం జగన్ నైజమని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. గత ఐదేళ్ల వైసీపీ పాలనలో ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన విధ్వంసం, చంద్రబాబు నాయుడు గారి అక్రమ అరెస్ట్ వరకు కొనసాగి వ్యవస్థలన్నీ నిర్వీర్యమయ్యాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. 2024 ఎన్నికల్లో ప్రజలు కూటమికి చారిత్రాత్మక విజయాన్ని అందించి అధికారం అప్పగించారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ రాష్ట్రాభివృద్ధికి, సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్నారని తెలిపారు. చట్టబద్ధ పాలనతో రాష్ట్రంలో క్రైమ్ రేటును 14 శాతం తగ్గించామని, శాంతిభద్రతలు అదుపులో ఉండటం వల్లే వేల కోట్ల రూపాయల పెట్టుబడులు, లక్షల ఉద్యోగాలు రాష్ట్రానికి తరలివస్తున్నాయని స్పష్టం చేశారు. శాప్ కార్యాలయం వద్ద నిరసనల పేరుతో వీరంగం సృష్టించిన వారిలో 60 నుంచి 70 శాతం మంది నేరచరిత్ర కలిగిన రౌడీషీటర్లు, పోక్సో కేసులు, హత్యాయత్నం కేసులు, బ్లేడ్ బ్యాచ్‌లతో సంబంధాలు ఉన్నవారేనని ఫోటోలు, కేసుల వివరాలతో సహా హోం మంత్రి మీడియా ముందు బట్టబయలు చేశారు.
Scroll for the next article