Politics23rd Oct 11:05 AMSunil Byrisetty1 min read
జోగి మేఘనకు ప్రమాదం.. మాజీ మంత్రిపై అనుమానం
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన కారుకు ప్రాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంపై మేఘన తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.. తమకు జరిగిన ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని జోగి మేఘన తండ్రి ఎన్
మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు జోగి మేఘన కారుకు ప్రాదం తప్పింది. అయితే ఈ ప్రమాదంపై మేఘన తండ్రి అనుమానం వ్యక్తం చేశారు.. తమకు జరిగిన ప్రమాదంపై అనుమానాలు ఉన్నాయని జోగి మేఘన తండ్రి ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నెల 15న జోగి రమేష్ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ విజయవాడ నుంచి తెలంగాణ రాష్ట్రం కోదాడ వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వచ్చిన ఓ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వీరి కారును ఢీకొంది. దీంతో వాహనం కొంత భాగం దెబ్బతింది. బస్సు డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున విచారణ చేయాలని మేఘన తండ్రి కృష్ణ పోలీస్‌స్టేషన్‌లో ఈ నెల 16న ఫిర్యాదు చేశారు. దీనిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేశారు. ఇప్పటికే మేఘన.. మామ రమేష్, భర్త రాజీవ్, మరికొందరు కుటుంబ సభ్యులపై హత్యాయత్నం, వరకట్న వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.