Politics24th Aug 02:48 PMSunil Byrisetty1 min read

వాటికీ సీఎం చంద్రబాబే కారణమన్న జోగి రమేష్

మాజీ మంత్రి జోగి రమేష్ తాజాగా తన కుటుంబ గొడవలకు ఏపీ సీఎం చంద్రబాబు కారణమంటూ వ్యాఖ్యానించారు. తనపై కుట్ర పన్నుతున్నారని ప్రెస్మీట్ లో చెప్పారు. ఇటీవల జోగి రమేష్ కుటుంబంలోని వివాదం వ

వాటికీ సీఎం చంద్రబాబే కారణమన్న జోగి రమేష్
మాజీ మంత్రి జోగి రమేష్ తాజాగా తన కుటుంబ గొడవలకు ఏపీ సీఎం చంద్రబాబు కారణమంటూ వ్యాఖ్యానించారు. తనపై కుట్ర పన్నుతున్నారని ప్రెస్మీట్ లో చెప్పారు. ఇటీవల జోగి రమేష్ కుటుంబంలోని వివాదం వీడియోలు సోషల్ మీడియాను షేక్ చేశాయి. అయితే జోగి వ్యక్తిగత విషయాలపై టీడీపీ పెద్దగా స్పందించలేదు. కానీ ఆయన తాజాగా ప్రెస్మీట్ పెట్టి రాజకీయం చేస్తున్నారు. తన కుటుంబంలో వివాదానికి కారణం టీడీపీ అంటూ వ్యాఖ్యానించారు. ఇటీవల కోడలు పెట్టిన కేసును కవర్ చేసుకునేందుకు టీడీపీపై ఆరోపణలు చేశారు. ముందుగా కోడలు మేఘనకు చేసిన అన్యాయానికి న్యాయం చేయాల్సిన కుటుంబ పెద్ద.. కుమారుడు కూడా బలవంతంగా పెళ్లి చేశావని నిందిస్తూంటే సమాధానం చెప్పుకోలేక ఇక రాజకీయం చేస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. రాజకీయాల కోసం కుటుంబ పరువును రోడ్డుమీదకు లాగారంటూ నెటిజన్లు చెబుతున్నారు.
Andhra Pradesh Politics
Jogi Ramesh
Chandrababu Naidu
TDP
Family Dispute
Political Allegations
Political Controversy
Former Minister
జోగి రమేష్ కుటుంబం
మేఘన
రాజకీయ కుట్ర
టీడీపీ ఆరోపణలు
ఏపీ రాజకీయాలు
Scroll for the next article