Politics14th Oct 04:45 PMSunil Byrisetty1 min read
కల్తీ మద్యం కేసులో జగన్, జోగి రమేష్‌లను అరెస్ట్ చేయాలి
కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. జోగి రమేష్ అనే అసాంఘిక శక్తి చంద్రబాబుకి చెడ్డ ప
కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న అభివృద్ధి చూసి ఓర్వలేక వైసీపీ నేతలు కుట్రలు చేస్తున్నారని మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ అన్నారు. జోగి రమేష్ అనే అసాంఘిక శక్తి చంద్రబాబుకి చెడ్డ పేరు తెచ్చేందుకు చిత్తూరు జిల్లాలో తన చిన్ననాటి స్నేహితుడైన అద్దేపల్లి జనార్థనరావుతో కలిసి కల్తీ మద్యం వ్యాపారం డ్రామాను ఆడారన్నారు. కల్తీ మద్యం తయారు చేసిన జయచంద్రా రెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేసిన వెంటనే, జోగి రమేష్ ఇబ్రహీంపట్నంలో కల్తీ మద్యం తయారవుతోందని, ఇది ప్రభుత్వంపై నిందలు వేయడానికి కుట్ర పన్నారని వివరించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్‌లను చెడ్డవారిగా చిత్రీకరించడమే జోగి రమేష్ పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. అద్దేపల్లి జనార్థనరావుతో జోగి రమేష్‌కు స్నేహం ఉందని అతనే స్వయంగా అంగీకరించారన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా చేసే జోగి రమేష్ కుట్రలపై రాజద్రోహం కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.