Politics3rd Nov 11:38 AMSunil Byrisetty1 min read
రోజంతా వాదనలు.. జోగి రమేష్ రిమాండ్!
ఆదివారం అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును రాత్రి వరకు విచారించారు. అనేక అంశాలపై వారిని వేర్వేరుగా ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీలో వారి పాత్ర సహా.
ఆదివారం అరెస్టైన మాజీ మంత్రి జోగి రమేష్, ఆయన సోదరుడు జోగి రామును రాత్రి వరకు విచారించారు. అనేక అంశాలపై వారిని వేర్వేరుగా ప్రశ్నించారు. నకిలీ మద్యం తయారీలో వారి పాత్ర సహా.. సొమ్ములు ఎవరెవరికి ఇచ్చారు? ఎంతెంత పంచుకున్నారు? అనే కోణంలో సుదీర్ఘ విచారణ చేశారు. అలాగే జోగి ఇంట్లో తనిఖీలు చేసి.. ఆయనతోపాటు.. కుమారుడు రాజీవ్, భార్య ఫోన్లను, ఇతర డాక్యుమెంట్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. అనంతరం.. హుటాహుటిన రిమాండ్ రిపోర్టు తయారు చేశారు. దీనిని రాత్రి 12 గంటలకు విజయవాడ లోని స్థానిక కోర్టుకు సమర్పించారు. ఇక, అక్కడి నుంచి తెల్లవారు జామున 4 గంటల వరకు ఇరు పక్షాల మధ్య హోరా హోరీ వాదనలు జరిగాయి. జోగి తరఫున వైసీపీ లీగల్ టీం నేత, ప్రముఖ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం.. జోగి సహా ఆయన సోదరుడు రాముకు రిమాండ్ విధిస్తూ.. న్యాయాధికారి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మొత్తం వ్యవహారాన్నీరికార్డు చేయించారు.