Politics10th Apr 09:22 AMSunil Byrisetty1 min read
నెక్ట్స్ వికెట్ మాజీ మంత్రి జోగి రమేష్?
గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఆరోపణలు, బూతులతో రెచ్చిపోయిన నేతలకు కూటమి ప్రభుత్వం షాకిస్తోంది. అవినీతి, అక్రమాల ఆరోపణల్లో ఉన్నవారిపైనా చర్యలు తీసుకుంటోంది. ఇటీవల మాజీ ఎఫ్డీసీ చైర్మన
గత ప్రభుత్వంలో ఇష్టానుసారంగా ఆరోపణలు, బూతులతో రెచ్చిపోయిన నేతలకు కూటమి ప్రభుత్వం షాకిస్తోంది.
అవినీతి, అక్రమాల ఆరోపణల్లో ఉన్నవారిపైనా చర్యలు తీసుకుంటోంది.
ఇటీవల మాజీ ఎఫ్డీసీ చైర్మన్ పోసాని కృష్ణమురళి, మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ, మాజీ ఎంపీ నందిగం సురేష్ తదితరులపై కేసులు నమోదు చేసి విచారణ జరుపుతున్న విషయం తెలిసిందే.
ఆయా కేసుల్లో వారంతా జైలుకూ వెళ్లిన పరిస్థితులు ఉన్నాయి.
ఇప్పుడు తాజాగా మాజీ మంత్రి జోగిరమేష్‌కు సీఐడీ నోటీసులు జారీ చేసింది.
చంద్రబాబు నివాసంపై దాడి కేసులో నోటీసులు అందజేసింది.
విచారణకు హాజరు కావాలంటూ సీఐడీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
ఇక నెక్ట్స్ వికెట్ ఈయనేనని చర్చించుకుంటున్నారు