News1st Jul 11:32 AMSunil Byrisetty1 min read
వేధింపులకు తలవంచక.. ఐఏఎస్‌గా ఎదిగి!
అత్తింటి వేధింపులతో ఉరి వేసుకుందామనుకున్న మహిళ ఇద్దరు పిల్లల కోసం ఒక్క క్షణం ఆలోచించింది ఆ ఆలోచనే ఆమెను ఐఏఎస్‌ను చేసింది. వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఒంటరి
అత్తింటి వేధింపులతో ఉరి వేసుకుందామనుకున్న మహిళ ఇద్దరు పిల్లల కోసం ఒక్క క్షణం ఆలోచించింది ఆ ఆలోచనే ఆమెను ఐఏఎస్‌ను చేసింది. వేధింపులు తట్టుకోలేక చనిపోదామనుకున్న సవితా ప్రధాన్ ఒంటరి పోరాటం చేసి నేటితరం ఆడపిల్లలకు మార్గదర్శిగా నిలుస్తోంది. మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్, చంబల్‌కు అర్బన్ అడ్మినిస్ట్రేషన్ జాయింట్ డైరెక్టర్ హోదాలో పని చేస్తున్న సవిత సొంతూరు మధ్యప్రదేశ్‌లోని మండీ గ్రామం. ఆదివాసి కుటుంబంలో ఏడుగురు సంతానంలో మూడో కుమార్తె సవిత. బీడీ ఆకులు ఏరుతూ, కూలీ చేసుకుంటూ పొట్ట పోషించుకునే కుటుంబంలో చదివించలేకపోయినా రూ.75 స్కాలర్‌షిప్ డబ్బులు, ఒక పూట జావ, జత యూనిఫాం అందిస్తారని పాఠశాలలో చేర్చగా అలా పది పాసైంది. వెంటనే పెళ్లి చేయగా, అత్తింట్లో కోడలిగా కాక పనిమనిషిగా పరిస్థితి మారిపోయింది. నిత్యం కొడుతుండటంతో ఆత్మహత్య చేసుకుందామనుకుని ఉరి వేసుకునేందుకు సిద్ధమైంది. అదే సమయంలో ఇద్దరు పిల్లల పరిస్థితి గుర్తొచ్చి, వారిని తీసుకుని రెండువేల రూపాయలతో ఇంట్లోంచి బయటకు వచ్చి, ఓ బ్యూటీపార్లర్‌లో సహాయకురాలిగా చేరింది. పిల్లలకు ట్యూషన్లు, ఇంట్లో వంటపనులు.. ఇలా దొరికిన పనల్లా చేస్తూనే బీఏ, ఎంఏ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో యూనివర్సిటీ ఫస్ట్‌గా నిలిచింది. ఉద్యోగం కోసం దినపత్రికలు తిరగేస్తోంటే.. యూపీఎస్సీ నోటిఫికేషన్ చూసి, రేయింబవళ్లు చదివి మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించింది. 24 ఏళ్లకే చీఫ్ మున్సిపల్ ఆఫీసర్‌గా ఎదిగింది. ఇప్పుడు తనలా మౌనంగా బాధలు భరించే ఆడపిల్లల కోసం హిమ్మత్ వాలీ లడ్కియా (బ్రేవ్ గర్ల్స్)పేరుతో యూట్యూబ్ ఛానల్‌ను మొదలుపెట్టి సమాజానికి ఆదర్శంగా నిలిచింది సవిత.