News29th May 09:36 AMSunil Byrisetty1 min read
బ్రాండ్ అంబాసిడర్గా జూ. ఎన్టీఆర్?
జూనియర్ ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు దక్కనునట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు జూ. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించనున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఏ సందర్భం వచ్చినా చంద్రబా
జూనియర్ ఎన్టీఆర్ కు కీలక బాధ్యతలు దక్కనునట్లు తెలుస్తోంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు జూ. ఎన్టీఆర్ బ్రాండ్ అంబాసిడర్గా నియమించనున్నట్లు సమాచారం. కొన్ని రోజులుగా ఏ సందర్భం వచ్చినా చంద్రబాబు, నారా లోకేశ్, జూనియర్ ఎన్టీఆర్ పరస్పరం అభినందనలు, శుభాకాంక్షలు చెప్పుకుంటున్నారు. భవిష్యత్ రాజకీయ సమీకరణాల్లోనూ తారక్ అవసరమని టీడీపీ అంచనా వేస్తోంది. ఈ క్రమంలోనే ప్రభుత్వ సంక్షేమ పథకాలను తారక్ ప్రమోట్ చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. పార్టీ వర్గాల నుంచి ఈ చర్చ జరుగుతోంది. దీనిపై స్పష్ఠత రావాల్సి ఉంది.