Entertainment20th May 11:17 AMSunil Byrisetty1 min read
కడపలో జూనియర్ ఎన్టీఆర్ బర్త్ డే సెలబ్రేషన్స్!
కడపలో ఘనంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అప్సర హాలులో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు. 101 మంది ఎన్టీఆర్ అభిమానులు రక్తద
కడపలో ఘనంగా నటుడు జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి.
ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అప్సర హాలులో భారీ రక్తదాన శిబిరం నిర్వహించారు.
101 మంది ఎన్టీఆర్ అభిమానులు రక్తదానం చేశారు.
రక్తదానం చేసిన అభిమానులను ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులు అభినందించారు.
అనంతరం దాదాపు 250 మందికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసి వడ్డించారు.
కడప జిల్లా ఎన్టీఆర్ ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎర్రమల సుధాకర్ రెడ్డి, పల్లె శివశంకర్ రెడ్డి, సురేంద్ర కుమార్ యాదవ్, ద్వారకనాథ్ రెడ్డి, సునీల్ కుమార్ పాల్గొన్నారు. జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించినట్లు తెలిపారు.