Telangana7th Oct 10:42 AMSunil Byrisetty1 min read
జూబ్లిహిల్స్ ఉప ఎన్నికలో గెలుపెవరిది?
దేశంలోనే అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో గెలుపెవరిదనే చర్చ మొదలైంది. మజ్లిస్ తమ మిత్రపక్షమని..తమకు సహకరిస్తుందని తెలంగాణ కాంగ్రెస్క చీఫ్ మహేష్ కుమార్ గౌ
దేశంలోనే అత్యంత ఖరీదైన నియోజకవర్గాల్లో ఒకటైన జూబ్లిహిల్స్ ఉపఎన్నికలో గెలుపెవరిదనే చర్చ మొదలైంది. మజ్లిస్ తమ మిత్రపక్షమని..తమకు సహకరిస్తుందని తెలంగాణ కాంగ్రెస్క చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ నమ్మకంగా ప్రకటించుకున్నారు. మజ్లిస్ సంపూర్ణంగా కాంగ్రెస్ కు సహకరిస్తే కాంగ్రెస్ కు అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ అసలు విషయం ఏమిటంటే మజ్లిస్ కానీ.. ఒవైసీ కానీ ఎప్పుడూ ఏ పార్టీకి బహిరంగంగా మద్దతు ప్రకటించరు. అంతా లోపాయికారీగానే రాజకీయం జరిగిపోతుంది. కాంగ్రెస్ విషయంలో సంపూర్ణంగా సహకరిస్తే.. ఆ పార్టీకి ప్లస్ అవుతుంది. అయితే బీజేపీ చేస్తున్న రాజకీయం ఆ పార్టీ సానుభూతిపరుల్లో సందేహాలకు కారణం అవుతోంది. టీడీపీ చాలా కాలంగా జూబ్లిహిల్స్ లో యాక్టివ్ గా లేదు. మరోవైపు కమ్మ సామాజిక వర్గం మద్దతు.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి గోపీనాథ్ సతీమణికి ఉంటుందని ఆ పార్టీ ఆశపడుతోంది. మొత్తంగా జూబ్లిహిల్స్‌లో రాజకీయం ఎలా ఉండబోతుందనే చర్చ జరుగుతోంది.