News29th Jun 08:40 AMSunil Byrisetty1 min read

రేపటి రోజులో లీప్ సెకండ్!

ఒకరోజుకు 86,400 సెకెన్లు అని మనకు తెలుసు. కానీ జూన్‌ 30కి మాత్రం 86,401 సెకన్లు. అదెలా అంటే.. సూర్యుని చుట్టూ తిరిగే భూ పరిభ్రమణం కాస్త తగ్గుతూ ఉండడంతో, ఆ లోటును భర్తీ చేయడానికి అద

రేపటి రోజులో లీప్ సెకండ్!
ఒకరోజుకు 86,400 సెకెన్లు అని మనకు తెలుసు. కానీ జూన్‌ 30కి మాత్రం 86,401 సెకన్లు. అదెలా అంటే.. సూర్యుని చుట్టూ తిరిగే భూ పరిభ్రమణం కాస్త తగ్గుతూ ఉండడంతో, ఆ లోటును భర్తీ చేయడానికి అదనంగా ఓ లీపు సెకనును నాసా జోడించింది. ప్రతిరోజూ 23:59:59 సెకన్ల వద్ద ముగిసి 00:00:00తో మరుసరి రోజు ప్రారంభమవుతోంది. కానీ జూన్‌ 30న మాత్రం 23:59:60 వద్ద ముగిసి 00:00:00 తో మరుసటి దినం ప్రారంభమవుతుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ దైనందిన జీవితాల్లో ఉపయోగించే యుటీసీ (ఆటోమేటిక్‌ టైమ్‌)గా యూనివర్శల్‌ కో ఆర్డినేటెడ్‌ టైమింగ్‌ విషయానికి మాత్రమే ఇది వర్తిస్తుంది. భూమి, చంద్రుడు, సూర్యుడు మధ్య ఆకర్షణ శక్తికి సంబంధించి జరిగే పరిణామాల నేపధ్యంలో భూమి పరిభ్రమణ వేగం స్వల్పంగా తగ్గుతూ వస్తోందని నాసా గుర్తించింది. అంటే, రెండు మిల్లీ సెకన్ల తేడా ఉంటోంది. దానర్ధం భూమి తన చుట్టూ తాను తిరిగే సమయం ప్రతిరోజూ సెకనులో రెండు వేల వంతు తగ్గుతోంది. దీన్ని మొదట్లో ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే ఈ చిన్నపాటి తేడా ప్రతిరోజూ ఏడాది పొడవునా జరిగితే అదంతా కలిపి దాదాపు ఒక సెకను అవుతోంది. అవసరమైనప్పుడు సరిచేసేందుకు యుటీసీకి లీప్‌ సెకనును కలుపుతూ ఉంటుంది. అందుకే లీపు సెకనును జూన్‌ 30, లేదా డిసెంబర్‌ 31న జోడిస్తూ ఉంటారు.
NASA
extra leap second
Earth's rotation
Coordinated Universal Time
86
401 seconds
Moon
జూన్ 30కి మాత్రం 86
401 సెకన్లు
Scroll for the next article