Education5th Apr 03:42 PMSunil Byrisetty1 min read

మోడల్ పరీక్షలోనూ మహిళల మార్కులే అధిక శాతం!!

కడప బార్ అసోసియేషన్లో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్ మోడల్ పరీక్షకు 40 మంది యువ న్యాయవాదులు హాజరయ్యారు. అందులో మొదటి పదిమందిలో ఎనిమిది మంది మహిళలు అధిక మార్కులు సాధించారు. ఈ మేరక

మోడల్ పరీక్షలోనూ మహిళల మార్కులే అధిక శాతం!!
కడప బార్ అసోసియేషన్లో నిర్వహించిన జూనియర్ సివిల్ జడ్జ్ మోడల్ పరీక్షకు 40 మంది యువ న్యాయవాదులు హాజరయ్యారు. అందులో మొదటి పదిమందిలో ఎనిమిది మంది మహిళలు అధిక మార్కులు సాధించారు. ఈ మేరకు భారత న్యాయవాదుల సంఘం కడప ఉమ్మడి జిల్లా కమిటీ అధ్యక్షులు సి.సుబ్రహ్మణ్యం, వర్కింగ్ ప్రెసిడెంట్ టీ. ఈశ్వర్ ప్రకటించారు. మోడల్ పరీక్ష ఉదయం 11 గంటల నుంచి ఒంటిగంట వరకు జరిగింది. మోడల్ ప్రశ్న పత్రాన్ని కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడు రాఘవరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రవదన, ఉపాధ్యక్షులు ఉమాదేవి విడుదల చేశారు. 100 ప్రశ్నలతో కూడిన మల్టిపుల్ ఛాయిస్ ప్రకారం మోడల్ పరీక్ష నిర్వహించారు. అభ్యర్థులు పరీక్ష రాయడం పూర్తికాగానే కీని విడుదల చేసి సరి చూసుకోగా షేక్ ముష్టాక్ 86, సి రాజ్యలక్ష్మి 84, ఏ రాహుల్ 80 మార్కులతో టాపర్స్ గా నిలిచారు. మొదటి పదిమందిలో ఎనిమిది మంది మహిళా న్యాయవాదులు అధిక మార్కులు సాధించిన వారిలో ఉన్నారని వారు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఐఏఎల్ న్యాయవాదులు నాగ సుబ్బారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, వెంకట శివ, ట్రెజరర్ సురేష్, స్పోర్ట్స్ సెక్రటరీ చిన్నయ్య పాల్గొన్నారు
Kadapa
Junior Civil Judge
Model Exam
కడప బార్ అసోసియేషన్
టీ. ఈశ్వర్
Scroll for the next article