News17th Aug 10:43 AMSunil Byrisetty1 min read

అత్యవసరాలకూ నో.. సమ్మెలోకి జూడాలు

ఏపీలో జూనియర్‌ వైద్యులు(జూడాలు) తగ్గడం లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉన్న జూడాలు నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను బహి

అత్యవసరాలకూ నో.. సమ్మెలోకి జూడాలు
ఏపీలో జూనియర్‌ వైద్యులు(జూడాలు) తగ్గడం లేదు. ప్రభుత్వం దిగి రావాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. ఇప్పటి వరకు సాధారణ వైద్య సేవలకు దూరంగా ఉన్న జూడాలు నేటి నుంచి అత్యవసర వైద్య సేవలను బహిష్కరించారు. స్టైపెండ్‌ల పెంపులో అన్యాయం జరుగుతోందంటూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలలు, బోధనాస్పత్రుల్లో ఇంటర్న్స్, జూనియర్‌ రెసిడెంట్స్, పీజీలు, సీనియర్‌ రెసిడెంట్స్‌ అత్యవసర సేవల్ని బహిష్కరించి ఆందోళనల్లో పాల్గొంటారు. వీరి సమ్మెకు ఏపీ ప్రభుత్వ వైద్యుల సంఘం(ఏపీజీడీఏ), ప్రభుత్వ వైద్యుల సంఘం (ఏపీజీడీఏఏపీ), ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌(ఐఎంఏ) ఏపీ విభాగం, వివిధ సంఘాలు మద్దతు ప్రకటించా­యి. ప్రతి రెండేళ్లకొకసారి స్టైఫండ్‌ను పెరగాలి. కానీ అలా జరగడం లేదు. ఈ నేపథ్యంలో జూడా­లు 30%పెంపు కోరగా కేవలం 3 శాతం పెంచుతామని చెప్పింది. దీంతో నిరసనగా జూడాలు సమ్మెలోకి వెళ్లారు.
Andhra Pradesh
Junior Doctors
Medical Strike
Emergency Services
Stipend Hike
Government Hospitals
Medical Colleges
జూనియర్ రెసిడెంట్లు
ఇంటర్న్స్
పీజీ వైద్యులు
సీనియర్ రెసిడెంట్లు
ఏపీజీడీఏ
ఐఎంఏ
వైద్యుల నిరసన
Scroll for the next article