Telangana18th Sep 11:29 AMSunil Byrisetty1 min read

మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్?

తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్టు స్టే ఆర్డర్లు అమలులో ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఏదులనాగులపల్లి సర్వే నంబర్లు 134, 135లలో

మోసపోయిన జూనియర్ ఎన్టీఆర్?
తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోర్టు స్టే ఆర్డర్లు అమలులో ఉన్నప్పటికీ రెవెన్యూ రికార్డులను తారుమారు చేసి, సంగారెడ్డి జిల్లా పరిధిలోని ఏదులనాగులపల్లి సర్వే నంబర్లు 134, 135లలో దాదాపు 150 ఎకరాల ప్రభుత్వ భూమికి బోగస్ పత్రాలు సృష్టించినట్లు వెలుగులోకి వచ్చింది. ఈ వివాదాస్పద ప్రభుత్వ భూమినే ప్రముఖ సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు పలువురికి కట్టబెట్టి మోసగించారని బయటపడింది, దీనిపై సమగ్ర విచారణ జరిపించి కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అసెంబ్లీలో డిమాండ్ చేశారు. నవీన్ యాదవ్ తండ్రి చిన్న శ్రీశైలం యాదవ్ కు హైదరాబాద్ నగరంలో, ముఖ్యంగా జూబ్లీహిల్స్, ఫిల్మ్‌నగర్ పరిసరాల్లో సినిమా ప్రముఖులతో దశాబ్దాలుగా ఉన్న సన్నిహిత సంబంధాలు, సినీ రంగంలోని పలు ల్యాండ్, ఆస్తి వివాదాలను సెటిల్మెంట్ చేసిన రికార్డు ఉంది. హైదరాబాద్ పశ్చిమ ప్రాంతంలో భూముల కొనుగోళ్లు, లావాదేవీల లోగుట్టు తెలిసిన కుటుంబం కావడంతోనే.. జూనియర్ ఎన్టీఆర్ కొనుగోలు వ్యవహారంలో జరిగిన మోసం గురించిన కచ్చితమైన సమాచారం ఎమ్మెల్యేకు లభించి ఉంటుందని భావిస్తున్నారు. ఎన్టీఆర్ వంటి అగ్ర హీరోనే తప్పుడు డాక్యుమెంట్లతో బురిడీ కొట్టించారంటే, తెరవెనుక రియల్ మాఫియా ఏ స్థాయిలో చక్రం తిప్పిందో అర్థం చేసుకోవచ్చు.
Scroll for the next article