Health12th Sep 01:58 PMSunil Byrisetty1 min read
జంక్ ఫుడ్.. చాలా డేంజర్!
కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని కేవలం నాలుగు రోజులపాటు తింటే మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ తాజా అధ్యయనం గుర్తించింది. చీజ్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివ
కొవ్వు అధికంగా ఉండే ఆహారాన్ని కేవలం నాలుగు రోజులపాటు తింటే మెదడులోని జ్ఞాపకశక్తి కేంద్రంపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఓ తాజా అధ్యయనం గుర్తించింది.
చీజ్ బర్గర్లు, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి హెచ్చరిక లాంటివట. ఊబకాయం లేదా మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలు మొదలుకాకముందే, ఈ జంక్ ఫుడ్ నేరుగా మెదడు పనితీరును దెబ్బతీస్తుందని చెబుతోంది. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ నార్త్ కరోలినా (యూఎన్‌సీ) పరిశోధకులు ఈ అధ్యయనం నిర్వహించారు. వీరి పరిశోధన వివరాలు ప్రఖ్యాత 'న్యూరాన్' సైన్స్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. అధిక కొవ్వు ఉన్న ఆహారం తిన్నప్పుడు, మెదడులోని జ్ఞాపకశక్తికి కీలకమైన హిప్పోక్యాంపస్ ప్రాంతంలో ఉండే 'సీసీకే ఇంటర్‌న్యూరాన్లు' అనే ప్రత్యేక కణాలు అతిగా చురుగ్గా మారుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. మెదడుకు అందాల్సిన గ్లూకోజ్ (చక్కెర) సరఫరాలో లోపం ఏర్పడటమే ఇందుకు ప్రధాన కారణమని తేలింది. ఈ కణాల అతి చురుకుదనం వల్ల జ్ఞాపకశక్తి ప్రక్రియ దెబ్బతింటుందని అధ్యయనానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ జువాన్ సాంగ్ వివరించారు.