Politics21st Aug 02:32 PMSunil Byrisetty1 min read

ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌

ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్‌ అధ్య

ఉప రాష్ట్రపతి పదవికి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి నామినేషన్‌
ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి జస్టిస్‌ బి.సుదర్శన్‌రెడ్డి ఉప రాష్ట్రపతి ఎన్నిక కోసం నామినేషన్‌ దాఖలు చేశారు. తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి సమర్పించారు. కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీ, శరద్‌ పవార్‌ సహా విపక్ష పార్టీల నేతలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్‌సీపీ (ఎస్పీ) అధినేత శరద్‌ పవార్‌, ఎస్పీ నేత రామ్‌గోపాల్‌ యాదవ్‌, డీఎంకే తిరుచ్చి శివ, టీఎంసీ నేత శతాబ్ది రాయ్‌, శివసేన (యూబీటీ) సంజయ్‌ రౌత్‌, సీపీఐ(ఎం) జాన్‌ బ్రిటాస్‌లు ఈ నామినేషన్‌ దాఖలు కార్యక్రమంలో పాల్గొన్నారు. దాదాపు 160 మంది ఎంపీలు ఆయనకు మద్దతుగా సంతకాలు చేసినట్లు సమాచారం. నామినేషన్‌ పత్రాలను పరిశీలించిన రిటర్నింగ్‌ అధికారి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డికి రశీదును అందజేశారు. ఈ సందర్భంగా జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. రాజ్యాంగ విలువలపై నిబద్ధత, వినయభావంతో నామినేషన్‌ దాఖలు చేస్తున్నానని అన్నారు.
Indian Politics
Justice B. Sudarshan Reddy
Vice President Election
Opposition Candidate
Congress
Mallikarjun Kharge
Sonia Gandhi
Rahul Gandhi
Sharad Pawar
ఉప రాష్ట్రపతి ఎన్నిక
రామ్‌గోపాల్‌ యాదవ్‌
డీఎంకే
టీఎంసీ
Scroll for the next article