National14th May 11:19 AMSunil Byrisetty1 min read

సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం

సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమ

సుప్రీంకోర్టు సీజేఐగా జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రమాణం
సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్ ఈరోజు ప్రమాణస్వీకారం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఉప రాష్ట్రపతి, ప్రధానమంత్రితోపాటు, కేంద్ర మంత్రులు, ఇతర అతిథుల సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపదీముర్ము ఆయనతో ప్రమాణస్వీకారం చేయించారు. ప్రధాని నరేంద్రమోదీ ఆయనకు అభినందనలు తెలిపారు. 2019 మే 24 నుంచి సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన అనేక రాజ్యాంగ ధర్మాసనాల్లో సభ్యుడిగా చరిత్రాత్మక తీర్పుల్ని వెలువరించారు. సీజేఐగా ఆరు నెలలు కొనసాగి నవంబరు 23న పదవీవిరమణ చేస్తారు. సీజేఐ పీఠాన్ని అధిరోహించిన రెండో దళిత వ్యక్తిగా గవాయ్ పేరు పొందారు.
Rashtrapati Bhavan
Justice BR Gavai takes oath as CJI
52nd CJI of India
President Draupadi Murmu
సుప్రీంకోర్టు 52వ ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ భూషణ్ రామకృష్ణ గవాయ్
Scroll for the next article