News17th Oct 01:36 PMSunil Byrisetty1 min read

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ ప్రమాణ స్వీకారం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈమేరకు శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన

హైకోర్టు న్యాయమూర్తిగా జస్టిస్ రమేశ్ ప్రమాణ స్వీకారం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత న్యాయస్థానంలో న్యాయమూర్తిగా జస్టిస్ దొనాడి రమేశ్ ప్రమాణ స్వీకారం చేశారు.ఈమేరకు శుక్రవారం హైకోర్టు మొదటి కోర్టు హాల్లో జరిగిన కార్యక్రమంలో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ జస్టిస్ రమేశ్ చే న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు.గతంలో ఎపి హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేస్తూ జస్టిస్ రమేశ్ అలహాబాద్ హైకోర్టుకు బదిలీ అయ్యారు.మరలా ఎపి హైకోర్టుకు న్యాయమూర్తిగా తిరిగి బదిలీ కావడంతో ఆయనతో చీఫ్ జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్ న్యాయమూర్తిగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో పలువురు హైకోర్టు న్యాయమూర్తులు,హైకోర్టు అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్,అదనపు సొలిసిటర్ జనరల్ ధనంజయ, రిజిస్ట్రార్లు, బార్ అసోసియేషన్, బార్ కౌన్సిల్ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.
Andhra Pradesh
High Court
Justice Donadi Ramesh
Chief Justice Dheeraj Singh Thakur
oath ceremony
judiciary
అడ్వకేట్ జనరల్ దమ్మాలపాటి శ్రీనివాస్
బార్ అసోసియేషన్
హైకోర్టు న్యాయమూర్తులు
Scroll for the next article